మంగళవారం 07 జూలై 2020
National - Jun 17, 2020 , 01:33:24

అప్రమత్తమైన భారత్‌

అప్రమత్తమైన భారత్‌

గాల్వన్‌ ఘర్షణతో భారత్‌ అప్రమత్తమైంది.  లడఖ్‌ నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌ వరకు సరిహద్దుల్లో బలగాలను అప్రమత్తం చేసింది. ఘటనపై త్రివిధ దళాల అధిపతులు, సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌తో రక్షణ, విదేశాంగ మంత్రులు మంగళవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. తాజా పరిస్థితిని ప్రధాని మోదీకి మంత్రులు వివరించారు. రాత్రి పొద్దుపోయేవరకు మంత్రులు అధికారులు చర్చలు జరుపుతూనే ఉన్నారు. ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలిసిన హోంమంత్రి అమిత్‌షా తాజా పరిస్థితిని వివరించారు. చైనాలో భారత రాయబారి విక్రం మిస్తీ, ఆ దేశ అధికారులతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఉద్రిక్తతలు తగ్గించేందుకు సైనిక, దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నాయని విదేశాంగశాఖ ప్రతినిధి ప్రకటించారు. మరోవైపు గాల్వన్‌ లోయ తమదేనని, ఎప్పటికీ చైనా సార్వభౌమత్వంలోనే ఉంటుందని ఆ దేశ సైన్యం ప్రకటించింది. దేశం యావత్తు ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటనపై అధికార, ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. సరిహద్దుల్లో సైనికులు మరణిస్తున్నా ప్రధాని ఎందుకు మౌనం వహిస్తున్నారని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. ఈ విమర్శలను తిప్పికొట్టిన బీజేపీ అధ్యక్షుడు నడ్డా, ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ సరిహద్దులు సురక్షితంగా ఉంటాయని ప్రకటించారు.  


logo