బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Feb 24, 2020 , 14:56:52

భాగస్వామ్యమే కాదు.. మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాం : ప‌్ర‌ధాని మోదీ

భాగస్వామ్యమే కాదు.. మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాం : ప‌్ర‌ధాని మోదీ


హైద‌రాబాద్‌:  న‌మస్తే ట్రంప్.. నినాదం మొతేరా స్టేడియంలో మారుమోగింది.  న‌మ‌స్తే ట్రంప్ అంటూ కిక్కిరిసిన స్టేడియంలో ప్ర‌ధాని మోదీ నినాదాలు చేశారు. ఆ త‌ర్వాత మోదీ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు. ఈ నేల గుజ‌రాత్‌ది.  కానీ జోష్ మాత్రం ఇండియాద‌న్నారు.  ఈ ఉత్సాహాం ఆకాశం అంతా ద‌ద్ద‌రిల్లుతోంద‌న్నారు. ఎయిర్‌పోర్ట్ నుంచి స్టేడియం వ‌ర‌కు.. భార‌తీయ సాంప్ర‌దాయ నృత్యాలు మారుమోగాయ‌న్నారు. మొతెరా స్టేడియంలో కొత్త చ‌రిత్ర ఆరంభ‌మైంద‌న్నారు.  చ‌రిత్ర రిపీటైంద‌ని మోదీ అన్నారు.  అయిదు నెల‌ల క్రితం అమెరికాలో హౌడీ మోదీ టూర్ చేశాన‌ని, ఇప్పుడు నా స్నేహితుడు ట్రంప్‌.. న‌మ‌స్తే ట్రంప్ ఈవెంట్‌లో భాగంగా ఇండియా వ‌చ్చార‌న్నారు. అతిపెద్ద ప్ర‌జాస్వామ్యం మిమ్ముల్ని స్వాగ‌తిస్తోంద‌న్నారు.  న‌మ‌స్తే అనే ప‌దం భార‌తీయ మూలాల‌కు చెందిన‌ద‌ని,  ఇది సంస్కృత భాష‌కు చెందిన ప‌ద‌మ‌ని, ఆ ప‌దంతో మ‌నిషిని గౌర‌వించ‌డ‌మే కాదు, ఆ మ‌నిషిలోని ఔన‌త్యాన్ని కూడా చూస్తామ‌న్నారు.  ఇండియా, అమెరికా బంధం.. కేవ‌లం ఓ భాగ‌స్వామ్యమే కాదు అని, ఇది మ‌రింత సన్నిత‌మైన స్నేహంగా మారింద‌న్నారు. అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబ‌ర్టీ ఉంద‌ని, ఇండియాలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంద‌న్నారు.  అంత‌క‌ముందు హౌజ్‌ఫుల్‌గా నిండిన స్టేడియంలో జాతీయ గీతాల‌ను ఆల‌పించారు.



logo