గురువారం 02 జూలై 2020
National - Jun 17, 2020 , 10:57:17

హ‌ద్దులు దాటొద్దు.. భార‌త్‌ను కోరిన చైనా క‌ల్న‌ల్‌

హ‌ద్దులు దాటొద్దు.. భార‌త్‌ను కోరిన చైనా క‌ల్న‌ల్‌

హైద‌రాబాద్‌:  రెచ్చ‌గొట్టే చ‌ర్య‌లకు భార‌త్ పాల్ప‌డ‌కూడ‌ద‌ని చైనా కోరింది.  స‌మ‌స్య‌ను శాంతియుతంగా ప‌రిష్క‌రించేందుకు చ‌ర్చ‌లు చేప‌ట్టాల‌ని సూచించింది.  గాల్వ‌న్ లోయ‌లో జ‌రిగిన హింసాత్మ‌క ఘ‌ర్ష‌ణ త‌ర్వాత‌.. చైనా వెస్ట్ర‌న్ థియేట‌ర్ క‌మాండ్‌కు చెందిన ప్ర‌తినిధి, సీనియ‌ర్ క‌ల్న‌ల్ జాంగ్ షూలీ మాట్లాడారు.  గాల్వాన్ వ్యాలీలో భార‌త బ‌ల‌గాలు.. లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి వ‌చ్చాయ‌ని క‌ల్న‌ల్ జాంగ్ ఆరోపించారు. రెచ్చ‌గొట్టేవిధంగా దాడికి పాల్ప‌డ‌డం వ‌ల్ల‌.. భీక‌ర‌మైన భౌతిక దాడులు జ‌రిగిన‌ట్లు జాంగ్ వెల్ల‌డించారు. 

ఆర్మీ క‌మాండ‌ర్ స్థాయి చ‌ర్చ‌లు జ‌రిగిన త‌ర్వాత కూడా భార‌త ద‌ళాలు ఆ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన‌ట్లు జాంగ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. గాల్వాన్ ప్రాంతం చైనా భూభాగ‌మ‌ని, అక్క‌డ ఇండియా ఎటువంటి చ‌ర్య‌లు చేప‌ట్టినా, దాని వ‌ల్ల సైనిక సంబంధాలు చాలా తీవ్రంగా దెబ్బ‌తింటాయ‌న్నారు.  ఫ్రంట్‌లైన్ ద‌ళాల‌ను అదుపులో పెట్టుకోవాల‌ని ఇండియాను డిమాండ్ చేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. 

గాల్వ‌న్ వ్యాలీలోని పాయింట్ 14 వ‌ద్ద సోమ‌వారం రాత్రి ఇరు దేశాల‌కు చెందిన సైనికులు కొట్టుకున్నారు. ఆ ఘ‌ట‌న‌లో భార‌త సైన్యంలోని 20 మంది సైనికులు వీర‌మ‌ర‌ణం పొందారు.  మ‌రో న‌లుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ది.  ఇక చైనా ద‌ళంలోనూ 35 మంది సైనికులు చ‌నిపోయిన‌ట్లు అమెరికా ఇంటెలిజెన్స్ పేర్కొన్న‌ది. దాదాపు 45 ఏళ్ల త‌ర్వాత రెండు దేశాల మ‌ధ్య మ‌ళ్లీ స‌రిహ‌ద్దు విష‌యంలో ర‌క్త‌పుటేరులు పారాయి.  
logo