సోమవారం 01 జూన్ 2020
National - May 19, 2020 , 18:37:33

కరోనా కేసులు 100 నుంచి లక్ష చేరడానికి ఏ దేశంలో ఎన్నిరోజులు..?

కరోనా కేసులు 100 నుంచి లక్ష చేరడానికి ఏ దేశంలో ఎన్నిరోజులు..?

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి గత కొన్ని నెలలుగా ప్రపంచ దేశాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే లక్షల్లో కేసులు నమోదయ్యాయి. దాదాపు మూడు లక్షల 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతటి మారణహోమం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి ఒక్కో దేశంలో ఒక్కో రీతిన విజృంభించింది. కొన్ని దేశాల్లో కేసుల సంఖ్య నిదానంగా మొదలై క్రమంగా వేగం పుంజుకుంటే, మరికొన్ని దేశాల్లో ఒక్కసారిగా కేసులు పెరిగిపోయాయి. 

మన దేశంలో తొలి కేసు నమోదైనప్పటి నుంచి ఆ కేసుల సంఖ్య వందకు చేరడానికి దాదాపు నెల రోజులు పట్టింది. కానీ ఆ తర్వాత మాత్రం 64 రోజుల్లోనే కేసుల సంఖ్య 100 నుంచి లక్షకు చేరింది. కేసుల సంఖ్య 100 నుంచి లక్షకు చేరడానికి ఏ దేశంలో ఎన్ని రోజులు పట్టిందో ఒకసారి పరిశీలిస్తే.. అమెరికాలో అతి తక్కువగా 25 రోజులకే కేసుల సంఖ్య లక్షకు చేరుకుంది. అలాగే ఇటలీలో 36 రోజుల్లో, యూకేలో 42 రోజుల్లో, ఫ్రాన్స్‌లో 39 రోజుల్లో జర్మనీలో 35 రోజుల్లో స్పెయిన్‌లో 30 రోజుల్లో కరోనా కేసుల సంఖ్య 100 నుంచి లక్షకు చేరింది. 

        


logo