శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
National - Aug 10, 2020 , 13:28:16

గాడిద పాల కోసం డెయిరీ!.. లీటర్‌ పాలు‌ రూ.7వేలు

గాడిద పాల కోసం డెయిరీ!.. లీటర్‌ పాలు‌ రూ.7వేలు

హర్యానా : మీరు చదివే వార్త మిమ్మల్ని నిజంగా ఆశ్చర్య పరుస్తుంది. ఆవు, గేదె, మేకతో సహా అనేక పాడి పశువులను భారతదేశంలో పాల కోసం పెంచుతున్నారు. కానీ దేశంలో కొత్త ఒక డెయిరీని ప్రారంభించబోతున్నారు. ఇప్పటి వరకు మీరు ఆవు, గేదె పాల డెయిరీలను మాత్రమే చూసి, విని ఉంటారు. కానీ త్వరలో గాడిద పాల డెయిరీని దేశంలో ప్రారంభం కానుంది. నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్వెన్స్ (ఎన్ఆర్‌సీఈ) త్వరలో హర్యానా హిస్సార్‌లో గాడిదల పాల డెయిరీ ప్రారంభించనుంది. హిసార్‌లోని ఎన్‌ఆర్‌సీఈ హలారి జాతి గాడిద నుంచి సేకరించిన పాలతో డెయిరీని తెరిచేందుకు సిద్ధంగా ఉంది. ఎన్‌ఆర్‌సీఈ హిసార్ ఇప్పటికే పది హలారి జాతి గాడిదల కోసం ఆర్డర్‌ చేసింది. ఈ గాడిదలు ప్రస్తుతం సంతానోత్పత్తిలో ఉన్నట్లు తెలిసింది. గాడిద పాలు మానవులకు ఎంతో మేలు చేయడమే కాక.. మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచడంలో ఎంతో సహాయపడనున్నాయి.  

హలారి జాతి ప్రాముఖ్యత

హలారి గాడిద జాతిని గుజరాత్‌లో గుర్తించారు. దాని పాలు ఔషధాల నిధిగా పరిగణిస్తున్నారు. పాలకు క్యాన్సర్‌, ఊబకాయం, అలర్జీ మొదలైన వ్యాధులపై పోరాడే సామర్థ్యం ఉంది. చిన్న పిల్లలకు ఆవు లేదా గేదె పాల నుంచి తరచూ అలర్జీలు వస్తాయి. కానీ గాడిదల హలారి రకం నుంచి వచ్చే పాలు పిల్లలకు ఎటువంటి అలర్జీ కలిగించవు. గాడిద పాలలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీఏజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అయితే ఈ మొత్తం చాలా తక్కువగా ఉంటుంది. గాడిద పాలపై పరిశోధన కార్యక్రమాన్ని ఎన్ఆర్‌సీఈ మాజీ డైరెక్టర్ డాక్టర్ ఎన్ ఆర్ త్రిపాఠి ప్రారంభించారు.  ఒక లీటర్ గాడిద పాలు మార్కెట్లో రూ.2000 నుంచి రూ.7000 వరకు విక్రయిస్తున్నారు. గాడిద పాలతో తయారు చేసే సౌందర్య ఉత్పత్తులు చాలా ఖరీదైనవి. గాడిద పాలను సబ్బులు, లిప్ బా‌మ్‌లు, బాడీ లోషన్లు తదితర వాటిని తయారు చేసేందుకు వినియోగిస్తున్నారు.


logo