National
- Dec 18, 2020 , 12:45:56
30 కోట్ల స్పుత్నిక్ టీకాలు భారత్లో ఉత్పత్తి

హైదరాబాద్: భారత్లో ఉత్పిత్తి అవుతున్న స్పుత్నిక్ వీ కోవిడ్ టీకాలకు రష్యా టెస్టింగ్ నిర్వహిస్తున్నది. రష్యన్ ఎంబసీ ఈ విషయాన్ని ఇవాళ తెలిపింది. ఇండియాలో ఉత్పత్తి అయిన తొలి టీకా శ్యాంపిళ్లకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రష్యన్ డైరక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సీఈవో కిరిల్ దిమిత్రివ్ తెలిపారు. 2021లో సుమారు 300 మిలియన్ల స్పుత్నిక్ డోసులను భారత్ ఉత్పత్తి చేయనున్నట్లు రష్యన్ ఎంబసీ ఓ ప్రకటనలో తెలిపింది. భారత్లో మొత్తం నాలుగు ఉత్పత్తిదారులతో ఒప్పందం కుదుర్చుకున్నామని, 30 కోట్లకు మంది డోసులను భారత్ ఉత్పత్తి చేయనున్నట్లు దిమిత్రివ్ తెలిపారు. హ్యూమన్ అడినోవైరస్ నుంచి స్పుత్నిక్ వీ టీకాను రూపొందించారు. స్పుత్నిక్ వీ టీకా 95 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు రష్యా చెప్పింది.
తాజావార్తలు
MOST READ
TRENDING