సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 16, 2020 , 17:11:27

కాన్సుల‌ర్ యాక్సెస్ ద్వారా కుల‌భూష‌ణ్‌ను క‌ల‌వ‌నున్న అధికారులు

కాన్సుల‌ర్ యాక్సెస్ ద్వారా కుల‌భూష‌ణ్‌ను క‌ల‌వ‌నున్న అధికారులు

ఢిల్లీ : పాకిస్థాన్ ఆర్మీ కోర్టు ద్వారా మ‌ర‌ణ‌శిక్ష విధింప‌బ‌డి ఆ దేశ జైల్లో ఉన్న భార‌త నావికాద‌ళ మాజీ అధికారి కులభూషణ్ జాద‌వ్‌ను అధికారులు కాన్సుల‌ర్ యాక్సెస్(రాయ‌బార కార్యాల‌యం, రాయ‌బార అధికారులు) ద్వారా క‌ల‌వ‌నున్నారు. ఇస్లామాబాద్‌లోని విదేశీ రాయ‌బార కార్యాల‌యంలో జాద‌వ్‌ను క‌ల‌వ‌నున్నారు. జాద‌వ్‌ను అరెస్టు చేసిన మూడేళ్ల త‌ర్వాత గ‌తేడాది సెప్టెంబ‌ర్ నెల‌లో క‌లిసేందుకు పాక్ అనుమ‌తి తెలిపింది. తన కేసులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయడానికి జూలై 20 గడువుకు ముందే జాదవ్ ను బేషరతుగా క‌ల‌వాల‌న్న భారత అభ్యర్థనను అనుస‌రించి అనుమ‌తి తెలిపింది. 

గూఢ‌చ‌ర్యం, ఉగ్ర‌వాదం కింద జాద‌వ్‌ను 2016లో అరెస్టు చేసిన‌ట్లు పాక్ పేర్కొంటున్న సంగ‌తి తెలిసిందే. కేసు విష‌య‌మై ఇస్లామాబాద్ హైకోర్టులో రివ్యూ పిటిష‌న్ దాఖ‌లు చేసేందుకు అతడు నిరాక‌రించిన‌ట్లు పాక్ తెలిపింది. కాగా ఈ వ్యాఖ్య‌ల‌ను భార‌త్ తోసిపుచ్చింది. తనపై చేసిన నేరారోపణకు సంబంధించి వ్యతిరేకంగా ఎటువంటి అప్పీల్ చేయకూడదని పాక్ అధికారులు త‌న‌ను బ‌ల‌వంతం చేసిన‌ట్లు వెల్ల‌డించింది.

జాదవ్ కు విధించిన‌ మరణశిక్షను సమీక్షించాలని అంతర్జాతీయ న్యాయస్థానం పాకిస్థాన్‌ను జూలై 2019 తీర్పులో ఆదేశించింది. భారతదేశానికి కాన్సులర్ ప్రవేశం పొందే హక్కు ఉంద‌ని కూడా తీర్పు ఇచ్చింది. ఐసిజె తీర్పును పాకిస్థాన్ "లెటర్ అండ్ స్పిరిట్" లో ఉల్లంఘించిందని భారత్ ఆరోపించింది. ఐసీజే తీర్పును ఉల్లంఘించ‌డంపై ఇప్ప‌టికే భార‌త్ తీవ్ర‌మైన ఆందోళ‌న‌ను వ్య‌క్తం చేసింది. 


logo