మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 15, 2020 , 19:10:47

ఈ నెలాఖ‌రులో బ్ర‌హ్మోస్ క్షిప‌ణి ప‌రీక్ష‌లు

ఈ నెలాఖ‌రులో బ్ర‌హ్మోస్ క్షిప‌ణి ప‌రీక్ష‌లు

న్యూఢిల్లీ: చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో భార‌త్‌ పెద్ద ఎత్తున బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిప‌ణుల‌ సత్తాను చాటబోతోంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధిపరచిన ఈ క్షిప‌ణులను భార‌త త్రివిధ ద‌ళాలు వేర్వేరుగా ప‌రీక్షించ‌నున్నాయి. ఈనెల ఆఖరి వారంలో హిందూ మహా సముద్ర ప్రాంతంలో ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఈ విష‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.  

బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిప‌ణి ఈ శ్రేణిలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా కార్యకలాపాలను నిర్వహించే ఆప‌రేష‌న‌ల్ వ్యవస్థను క‌లిగి ఉన్న‌ది. పైగా ఇటీవలే డీఆర్‌డీవో ఈ మిసైల్ సిస్టమ్ ప‌రిధిని ప్రస్తుత 298 కిలోమీటర్ల నుంచి 450 కిలోమీటర్లకు పెంచింది. భార‌త త్రివిధ‌ దళాలు ఈ వ్యవస్థను వివిధ రేంజ్‌లలో పరీక్షించబోతున్నాయి. ఈ పరీక్షలవల్ల బ్ర‌హ్మోస్‌ పని తీరును మరింత మెరుగుపరిచేందుకు అవకాశం కలుగుతుంది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.