శనివారం 23 జనవరి 2021
National - Dec 21, 2020 , 15:27:41

యూకే నుంచి వ‌చ్చే విమానాల‌పై నిషేధం

యూకే నుంచి వ‌చ్చే విమానాల‌పై నిషేధం

న్యూఢిల్లీ: బ‌్రిట‌న్‌లో కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ శ‌ర‌వేగంగా వ్యాప్తిస్తున్న నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. యూకే నుంచి వ‌చ్చే విమానాల‌పై తాత్కాలికంగా నిషేధం విధించింది. ఈ నెల 22వ తేదీ రాత్రి 11.59 గంట‌ల నుంచి డిసెంబ‌ర్ 31 రాత్రి 11.59 గంట‌ల వ‌ర‌కు యూకే నుంచి వ‌చ్చే విమానాల‌కు అనుమ‌తి లేదు అని కేంద్ర విమానయాన శాఖ వెల్ల‌డించింది. ఇప్ప‌టికే ఫ్రాన్స్‌, జ‌ర్మ‌నీ, బెల్జియం, కెన‌డా, ఇట‌లీ, ఆస్ట్రియా వంటి దేశాలు యూకే నుంచి వ‌చ్చే విమానాల‌ను నిషేధించిన సంగ‌తి తెలిసిందే.  ప్ర‌స్తుతం యూకే నుంచి వ‌స్తున్న విమానాల్లో ఉన్న ప్ర‌యాణికుల‌కు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా ఆర్టీ-పీసీఆర్ టెస్ట్‌ను త‌ప్ప‌నిస‌రి చేసిన‌ట్లు కూడా విమాన‌యాన శాఖ వెల్ల‌డించింది. ఇప్ప‌టికే యూకే నుంచి బ‌య‌లుదేరిన విమానాలు లేదా డిసెంబ‌ర్ 22, రాత్రి 11.59 గంట‌ల‌లోపు వ‌చ్చే విమానాల్లో ప్ర‌యాణికుల‌కు ఈ టెస్ట్‌ను త‌ప్ప‌నిస‌రి చేశారు.

ఇవి కూడా చదవండి..

కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ ఏమిటి? ఎందుకంత ప్ర‌మాద‌క‌రం?

బ్లాక్‌ మండే.. భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

చంద్రుడిపై సాగు సాధ్య‌మేనా.. చైనా ప్ర‌యోగం ఏం చెబుతోంది?
 వంద రూపాయలకే భగవద్గీత.... వీడియో
logo