శుక్రవారం 10 జూలై 2020
National - Feb 15, 2020 , 10:23:01

క‌శ్మీర్‌పై జోక్యం వ‌ద్దు.. ట‌ర్కీకి చెప్పిన‌ భార‌త్‌

క‌శ్మీర్‌పై జోక్యం వ‌ద్దు.. ట‌ర్కీకి చెప్పిన‌ భార‌త్‌

హైద‌రాబాద్‌:  క‌శ్మీర్ అంశంపై పాకిస్థాన్‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ట‌ర్కీ అధ్య‌క్షుడు రిసెప్ త‌యిప్ ఎర్డ‌గోన్ అన్నారు.  పాక్‌లో టూర్ చేస్తున్న ఆయ‌న‌.. ఇమ్రాన్‌తో స‌మావేశ‌మైన త‌ర్వాత ఈ వ్యాఖ్య‌లు చేశారు. అయితే ఆ వ్యాఖ్య‌ల‌ను భార‌త్ ఖండించింది.  జ‌మ్మూక‌శ్మీర్ అంశంలో జోక్యం చేసుకోవ‌ద్దు అని ట‌ర్కీకి భార‌త్ సూచించింది. భార‌త్‌లో క‌శ్మీర్ అంతర్భాగ‌మ‌ని విదేశాంగ మంత్రి జైశంకర్ స్ప‌ష్టం చేశారు. క‌శ్మీర్‌పై వాస్త‌వ విష‌యాల‌ను ట‌ర్కీ తెలుసుకోవాల‌ని జైశంక‌ర్ అన్నారు.  పాక్ నుంచి కొన‌సాగుతున్న ఉగ్ర కార్య‌క‌లాపాల వ‌ల్ల భార‌త్‌తో పాటు ఉప‌ఖండంలో త‌లెత్తున్న ప‌రిస్థితుల‌ను ట‌ర్కీ అర్థం చేసుకోవాల‌న్నారు. ద‌శాబ్ధాలుగా క‌శ్మీరీ సోద‌రులు ఇబ్బందిప‌డుతున్నార‌ని,  ఏక‌ప‌క్షంగా కొన్ని నిర్ణ‌యాలు తీసుకోవ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య‌లు మ‌రింత ముదిరాయ‌ని ట‌ర్కీ అధ్య‌క్షుడు ఎర్డ‌గోన్ అన్నారు.  గ‌త ఏడాది ఆగ‌స్టులో క‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేస్తూ భార‌త్ తీసుకున్న నిర్ణ‌యాన్ని ప్ర‌స్తావిస్తూ ఎర్డ‌గోన్ ఆ వ్యాఖ్య‌లు చేశారు. 


logo