గురువారం 25 ఫిబ్రవరి 2021
National - Jan 24, 2021 , 06:45:15

వివాదం పరిష్కారమే ఎజెండాగా.. నేడు చైనాతో భారత్‌ చర్చలు

వివాదం పరిష్కారమే ఎజెండాగా.. నేడు చైనాతో భారత్‌ చర్చలు

లడఖ్‌ : తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంట నెలకొన్న సరిహద్దు వివాదంపై భారత్‌ - చైనా మధ్య ఆదివారం కార్ప్స్‌ కమాండర్‌ స్థాయి చర్చలు ఆదివారం జరుగనున్నాయి. చుషూల్‌ ప్రాంతంలో మాల్డోలో తొమ్మిదో రౌండ్‌ ఉదయం 9.30గంటలకు ప్రారంభం కానున్నాయి. ఇందు కోసం ఇప్పటికే విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి (తూర్పు ఆసియా), డీజీఎంఓ అధికారులు శనివారమే లడఖ్‌కు చేరుకున్నారు. ఇంతకు ముందు ఎనిమిది రౌండ్ల పాటు కార్ప్స్ కమాండర్‌ స్థాయి చర్చలు జరిగినా బలగాల ఉప సంహరణపై వెనక్కి తగ్గకపోవడంతో ప్రతిష్ఠంభన నెలకొంది. గతేడాది జూన్‌లో గాల్వాన్‌లో లోయలో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ చెలరేగగా.. భారత్‌కు చెందిన 21 మంది సైనికులు ప్రాణాలను కోల్పోయారు. అప్పటి నుంచి తూర్పు లడఖ్‌లో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కమ్ముకుంది. ఇరుదేశాలు భారీగా బలగాలను మోహరించాయి.

సరిహద్దు వివాదం పరిష్కారం కోసం కమాండర్‌ స్థాయి అధికారుల మధ్య చర్చలు జరుగుతాయని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాత్సవ శుక్రవారం ప్రకటించారు. ఇరుదేశాలు దౌత్య, మిలటరీ మార్గాల ద్వారా రెండు దేశాలూ నిత్యం మాట్లాడుకుంటున్నాయని తెలిపారు. ఇరుదేశాల విదేశాంగ మంత్రుల మధ్య గత ఏడాది సెప్టెంబర్‌ 10న మాస్కోలో కుదిరిన ఐదు సూత్రాల ఒప్పందం అమలుపైనే ప్రధానంగా చర్చలు జరగనున్నాయి. అయితే ఎల్‌ఏసీలో సైన్యాన్ని వెనక్కి తీసుకొని వెళ్లే తొలి బాధ్యత చైనాదేనని భారత్‌ స్పష్టం చేసింది. ఆదివారం జరిగే చర్చల్లో లెఫ్టినెంట్‌ జనరల్‌ పీజీకే మీనన్‌ (జీఓసీ 14 కార్ప్స్‌), ఐజీ నార్త్‌ ఫ్రాంటియర్‌ ఐజీ దీపం సేథ్‌, ఐటీబీపీ బ్రిగ్‌ రాజీవ్‌ ఘాయ్‌ (ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌, ఢిల్లీ) మేజర్‌ జనరల్‌ సంజయ్‌ మిత్రా (జీఓసీ 39), మేజర్‌ జనరల్‌ ఆర్‌ఎస్‌ రామన్‌, బ్రిగేడియర్‌ హెచ్‌ఎస్‌ గిల్‌తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo