శుక్రవారం 15 జనవరి 2021
National - Dec 04, 2020 , 15:03:34

అంత‌ర్గత‌ విష‌యాల్లో జోక్యం వ‌ద్దు.. కెన‌డా దౌత్యాధికారికి స‌మ‌న్లు

అంత‌ర్గత‌ విష‌యాల్లో జోక్యం వ‌ద్దు.. కెన‌డా దౌత్యాధికారికి స‌మ‌న్లు

హైద‌రాబాద్‌:  కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ ఢిల్లీలో పంజాబ్ రైతులు చేప‌డుతున్న‌ నిర‌స‌న‌ల‌పై కెన‌డా ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడో ఇటీవ‌ల ఆందోళ‌న వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే.  ఈ అంశాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న భార‌త్‌.. ఇవాళ  కెనడా హై క‌మిష‌న‌ర్‌కు స‌మ‌న్లు జారీ చేసింది. కెన‌డా ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడోతో పాటు ఆ దేశ ఎంపీలు .. రైతుల ఆందోళ‌న ప‌ట్ల కామెంట్ చేయ‌డం స‌రైందికాద‌ని ఇండియా హెచ్చ‌రించింది.  కెన‌డా నేత‌ల వ్యాఖ్య‌ల‌తో రెండు దేశాల మ‌ధ్య బంధాలు బ‌ల‌హీన‌ప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు భార‌త్ త‌న నిర‌స‌న‌లో పేర్కొన్న‌ది. భార‌త అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకోవ‌డం ఆమోద‌యోగ్యం కాదు అని భార‌త్ ఆరోపించింది. ఇలాంటి చ‌ర్య‌లు ఇక ముందు కొన‌సాగితే, అప్పుడు రెండు దేశాల బంధాలపై ప్ర‌భావం ప‌డుతుంద‌ని భార‌త విదేశాంగశాఖ వెల్ల‌డించింది. మీ నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌ల వ‌ల్ల కెన‌డాలో ఉన్న భార‌త హై క‌మిష‌న్‌, కాన్సులేట్ల ముందు తీవ్ర‌వాద కార్య‌క్ర‌మాలు పెరిగినట్లు భార‌త్ ఆరోపించింది. ఇది భ‌ద్ర‌తాప‌ర‌మైన స‌మ‌స్య‌గా మారుతోంద‌ని భార‌త్ త‌న హెచ్చ‌రిక‌లో పేర్కొన్న‌ది.