శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 17, 2020 , 16:45:35

క్విక్ రియాక్ష‌న్ క్షిప‌ణి ప‌రీక్ష స‌క్సెస్‌..

క్విక్ రియాక్ష‌న్ క్షిప‌ణి ప‌రీక్ష స‌క్సెస్‌..

హైద‌రాబాద్‌: క్విక్ రియాక్ష‌న్ స‌ర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్‌ను ఇవాళ భార‌త్ విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది.  అయితే ట్ర‌య‌ల్స్ స‌మ‌యంలో.. టార్గెట్‌ను ఆ క్షిప‌ణి వ్య‌వ‌స్థ పూర్తిగా ధ్వంసం చేసిన‌ట్లు అధికారులు చెప్పారు. మీడియం రేంజ్‌లో ఉన్న ఓ మాన‌వ ర‌హిత విమానాన్ని ఆ క్షిప‌ణి పేల్చిన‌ట్లు తెలుస్తోంది. న‌వంబ‌ర్ 13వ తేదీన కూడా క్విక్ రియాక్ష‌న్ స‌ర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్‌ను ప‌రీక్షించిన విష‌యం తెలిసిందే. ఆ ప‌రీక్ష‌లో బాన్‌షీ పైల‌ట్‌ర‌హిత విమానాన్ని ఆ క్షిప‌ణి ధ్వంసం చేసింది.