గురువారం 03 డిసెంబర్ 2020
National - Oct 22, 2020 , 09:42:22

నాగ్ మిస్సైల్.. ఫైన‌ల్ ట్ర‌య‌ల్స్ స‌క్సెస్

నాగ్ మిస్సైల్.. ఫైన‌ల్ ట్ర‌య‌ల్స్ స‌క్సెస్

హైద‌రాబాద్‌:  నాగ్ యాంటీ ట్యాంక్ మిస్సైల్ తుది ట్ర‌య‌ల్స్‌ను ఇవాళ విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు. డిఫెన్స్ రీస‌ర్చ్ అండ్ డెవ‌ల‌ప్మెంట్ ఆర్గ‌నైజేష‌న్‌(డీఆర్‌డీవో) అభివృద్ధి చేసిన ఈ క్షిప‌ణిని ఇవాళ రాజ‌స్థాన్‌లోని పోఖ్రాన్ ఫైరింగ్‌ రేంజ్‌ల్లో ప‌రీక్షించారు.  ఉద‌యం 6.45 నిమిషాల‌కు ఈ ప‌రీక్ష సాగింది.  నాలుగు కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను ఈ మిస్సైల్ ధ్వంసం చేయ‌గ‌ల‌దు.  దీంట్లో ఇన్‌ఫ్రా రెడ్ ఇమేజ్ సీక‌ర్ కూడా ఉన్న‌ది.  త్వ‌ర‌లోనే ఈ క్షిప‌ణిని భార‌తీయ సైన్యంలో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. వార్‌హెడ్‌తో మిస్సైల్ ప‌రీక్ష జ‌రిగిన‌ట్లు అధికారులు చెప్పారు. అక్టోబ‌ర్ 19వ తేదీన ఒడిశాలో స్టాండ్ ఆప్ యాంటీ ట్యాంక్ మిస్సైల్‌ను కూడా డీఆర్‌డీవో ప‌రీక్షించింది.  హెలికాప్ట‌ర్ ద్వారా ఆ క్షిప‌ణిని ప‌రీక్షిస్తారు.  ప‌ది కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను సాంత్ మిస్సైల్ చేధించింది.   

డీఆర్‌డీవో ఇటీవ‌ల వ‌రుస‌గా క్షిప‌ణుల‌ను ప‌రీక్షిస్తూ కొత్త కొత్త మైలురాళ్ల‌ను న‌మోదు చేస్తున్న‌ది. ఇటీవ‌ల వెయ్యి కిలోమీట‌ర్ల దూరం వెళ్లే స‌బ్ సోనిక్ క్రూయిజ్ నిర్భ‌య్ మిస్సైల్ ఒక్క‌టే విఫ‌ల‌మైంది. సాంకేతిక లోపం వ‌ల్ల ఆ క్షిప‌ణి ప‌రీక్ష ఫెయిల్ అయ్యింది. బూస్ట‌ర్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించిన త‌ర్వాత‌.. మ‌రికొన్ని రోజుల్లో మ‌ళ్లీ నిర్భ‌య్‌ను ప‌రీక్షించనున్న‌ట్లు డీఆర్‌డీవో చెప్పింది.  డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన నాగ్ మిస్సైల్‌ను.. భూమి నుంచి కానీ, ఆకాశం నుంచి కానీ ప్ర‌యోగించే వీలు ఉంటుంది.  ఈ మిస్సైళ్ల రేంజ్ 4 నుంచి 7 కిలోమీట‌ర్లు మాత్ర‌మే. ఇలాంటి క్షిప‌ణి సామ‌ర్థ్యం కేవ‌లం కొన్ని దేశాల వ‌ద్దే ఉన్న‌ది.