గురువారం 04 జూన్ 2020
National - May 07, 2020 , 15:32:56

12శాతం క్షిణించిన భార‌త స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌...

12శాతం క్షిణించిన భార‌త స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌...

ఢిల్లీ:  క‌రోనా వైర‌స్ ప్ర‌భావం, లాక్‌డౌన్ ప‌రిస్థితి వ‌ల్ల భార‌త దేశంలో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు ఒడ‌దొడుకుల‌ను ఎదుర్కొంటున్నాయి. లాక్‌డౌన్ వ‌ల్ల ముబైళ్ల స‌ర‌ఫ‌రా, డిమాండ్ రెండూ త‌గ్గిపోవ‌డంతో ప‌రిశ్ర‌మ రెండ‌వ త్రైమాసికంలో(ఏప్రిల్‌-జూన్ కాలం)లో గ‌రిష్ట న‌ష్టాన్నికూడ‌గ‌ట్టుకున్నాయి. సీఎంఆర్ ఇచ్చిన నివేదిక ప్ర‌కారం ఇండియా ముబైల్ మార్కెట్ రివ్యూ రిపోర్టు క్యూ1 2020 ప్ర‌కారం భార‌త‌దేశంలో మొత్తం స్మార్ట్‌ఫోన్‌ల ఎగుమ‌తి కేవ‌లం నాలుగుశాతం పెరిగింది. 5 జీ ఫోన్‌లు వ‌స్తుండ‌టంతో దాని ప్ర‌భావం కూడా 4జీ స్మార్ట్‌ఫోన్‌ల‌పై ప‌డింది. క‌రోనా వైర‌స్ మ‌న దేశానికి రాక‌ముందు స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మంచిగానే ఉంది.

 సంవ‌త్స‌రం ప్రారంభంలో ఫోన్‌ల అమ్మ‌కాలు బాగానే సాగాయి. భార‌త్‌లో కోవిడ్‌-19 కేసుల సంఖ్య 500 మార్క్‌ను దాట‌డంతో దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో స్మార్ట్‌ఫోన్ల డిమాండ్‌, స‌ర‌ఫ‌రాలో అనిశ్చితి నెల‌కొంది. ఇప్పుడు కోల్పోయిన మార్కెట్‌ను తిరిగి పండ‌గ‌ల సీజ‌న్లో పొంద‌వ‌చ్చ‌న్న ఆశాభావాన్ని నిపుణులు వ్య‌క్తం చేస్తున్నారు. క్యూ1 2020లో షియోమి(30శాతం), వివో (17)శాతం, శామ్‌సంగ్‌(16శాతం) అమ్మ‌కాలు జ‌రిపి మొద‌టి మూడు స్థానాల్లో నిలిచాయి. రియ‌ల్‌మీ, ఐక్యూ కంపెనీలు 5జీ స్మార్ట్‌ఫోన్‌లు విడుద‌ల చేశాయి. దీనిలో రియ‌ల్‌మీ ఎక్స్ 50 ప్రో 5జీ ఫోను ఎక్కువ‌గా అమ్ముడుపోయింది. ఫీచ‌ర్ ఫోన్ల నుంచి స్మార్ట్ ఫోన్‌లోకి వినియోదారులు మారుతుండ‌టంతో ఫీచ‌ర్ ఫోన్ విభాగం 20శాతం క్షీణించింది. 


logo