రష్యా పాక్ సంబంధాలపై భారత్‌కు ఆందోళన వద్దు

న్యూఢిల్లీ: రష్యా పాకిస్థాన్ మధ్య సంబంధాలపై భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత్‌లో రష్యన్ డిప్యూటీ రాయబారి ఎన్ బాబుష్కిన్ అభిప్రాయపడ్డారు. పాక్‌తో కలిసి నిర్వహించే సైనిక విన్యాసాలు ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగమే అని తెలిపారు. ఈ విషయంలో భారతదేశం ఆందోళన చెందాలని మేము హృదయపూర్వకంగా కోరుకోవడం లేదని చెప్పారు. ఇతర దేశాల సున్నితత్వాన్ని గౌరవించటానికి రష్యా కట్టుబడి ఉంటుందని అన్నారు. రష్యా పాక్ మధ్య పెరుగుతున్న సంబంధాల గురించి భారత్ ఆందోళన చెందాలా అని మీడియా అడిగినప్పుడు ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.
మరోవైపు భారత్, చైనాకు రష్యా విశ్వసనీయ భాగస్వామి అని భారత్‌లో రష్యన్ రాయబారి నికోలాయ్ కుడాషేవ్ తెలిపారు. ఎస్సీవో, బ్రిక్స్, ఆర్ఐసీ వేదికలతో సహా రెండు పొరుగు ఆసియా దిగ్గజాల మధ్య సహకారం కోసం సానుకూల వాతావరణాన్ని కల్పించడం చాలా ముఖ్యమని తాము భావిస్తున్నామని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.తాజావార్తలు
- త్వరలోనే నిరుద్యోగ భృతి : మంత్రి కేటీఆర్
- నిమ్మగడ్డ బెదిరింపులకు భయపడేది లేదు: మంత్రి పెద్దిరెడ్డి
- దేశంలో 165కు చేరిన కొత్త రకం కరోనా కేసులు
- 2021 మెగా ఫెస్టివల్..ఈ ఏడాది 14 సినిమాలు..!
- హైవేపై ఎస్యూవీ నడిపిన ఐదేళ్ల చిన్నారి
- సీసీఎంబీ నేతృత్వంలో ఆర్టీ-పీసీఆర్ వర్క్‌షాప్‌లు
- ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
- రైతులకు వ్యతిరేకంగా సింఘూలో స్థానికుల ఆందోళన
- వాట్సాప్ డెస్క్‌టాప్ యూజర్లకు కొత్త సెక్యూరిటీ ఫీచర్
- దేశం అబ్బురపడేలా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు