ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 14, 2020 , 07:24:52

2036 నాటికి వృద్ధ భారతం

2036 నాటికి వృద్ధ భారతం

న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యధిక యువశక్తితో తులతూగుతున్న భారతదేశం 2036నాటికి వృద్ధభారతం అవుతుందని ఓ అధ్యయనం తెలిపింది. 2011 జనాభా లెక్క ప్రకారం దేశంలో 0-24 ఏండ్ల మధ్య వయస్కులు 50.2శాతం ఉన్నారు. 2036నాటికి ఇది 25.3శానికి పడిపోతుందని జనాభాపై అధ్యయనానికి ఏర్పడిన సాంకేతిక బృందం తన నివేదికలో వెల్లడించింది. జననాల రేటు తగ్గటం, జీవితకాలం పెరుగటం కూడా దేశంలో వృద్ధుల జనాభా పెరుగటానికి మరో కారణం అవుతుందని పేర్కొంది. 2011 లెక్కల ప్రకారం దేశ జనాభాలో 60 ఏండ్లు పైబడినవారు 8.4శాతం ఉండగా, 2036నాటికి 14.9శాతానికి పెరుగనున్నది. logo