శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 20:07:49

త్వరలోనే భారత్‌కు అత్యాధునికి బోయింగ్‌ విమానాలు

త్వరలోనే భారత్‌కు అత్యాధునికి బోయింగ్‌ విమానాలు

న్యూ ఢిల్లీ: చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌ తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకుంటున్నది. ఇందులో భాగంగానే అమెరికా నుంచి I.8 బిలియన్ డాలర్ల విలువైన మరో ఆరు బోయింగ్ పోసిడాన్ -8 ఐ విమానాలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. ఇందుకోసం ‘లెటర్ ఆఫ్ రిక్వెస్ట్’ జారీ చేసింది.  కొత్త పీ -8 ఐ విమానం సీఓఎంసీఏఎస్‌ఏ(కమ్యూనికేషన్స్‌ కంపాటిబిలిటీ అండ్‌ సెక్యూరిటీ అగ్రిమెంట్‌) రక్షిత పరికరాలను కలిగి ఉంటుంది. 

చైనాతో డోక్లాం స్టాండ్ ఆఫ్ సమయంలో, పుల్వామా టెర్రర్ దాడి తర్వాత పాకిస్తాన్ పై నిఘా ఉంచేందుకు భారతదేశం ఈ విమానాలనే ఉపయోగించింది. హిందూ మహాసముద్రంతోపాటు తూర్పు లడఖ్‌పై నిఘా మిషన్లు నిర్వహించేందుకు ఇండియా ఇప్పటికే పీ ​​-8 ఐ నావికాదళ పెట్రోలింగ్ విమానాలను ఉపయోగిస్తోంది. యూఎస్ కాంగ్రెస్ నుంచి ఆమోదం పొందిన తర్వాత అమెరికా త్వరలో అంగీకార పత్రాన్ని పంపుతుంది. ఆ తర్వాత వచ్చే ఏడాది ఒప్పందం కుదుర్చుకోవచ్చు. ఆరు కొత్త పీ ​​-8 ఐ  విమానాలు వాణిజ్యపరంగా లభించే వాటితో పోలిస్తే చాలా ఆధునికమైనవి, సురక్షితమైనవి. లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo