గురువారం 09 జూలై 2020
National - Jun 16, 2020 , 01:37:33

ముగిసిన సుశాంత్‌ అంత్యక్రియలు

ముగిసిన సుశాంత్‌ అంత్యక్రియలు

ముంబై, జూన్‌ 15: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అంత్యక్రియలు సోమవారం జరిగాయి. ముంబైలోని పవన్‌ హన్స్‌ శ్మశానవాటికలో జరిగిన ఈ అంత్యక్రియలకు కుటుంబసభ్యులు, స్నేహితులు, సినిమా, టీవీ ఇండస్ట్రీకి చెందిన కొందరు సన్నిహితులు హాజరయ్యారు. ముంబైలోని బాంద్రాలో ఉన్న తన అపార్టుమెంట్‌లో ఆదివారం సుశాంత్‌ ఉరివేసుకొని ఆత్యహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అంత్యక్రియలకు నటులు వివేక్‌ ఒబెరాయ్‌, రణ్‌దీప్‌ హూడా, గాయకుడు ఉదిత్‌ నారాయణ్‌ తదితరులు ఉన్నారు. మరోవైపు  తీవ్ర మానసిక ఒత్తిడి నుంచి బయటపడటానికి సుశాంత్‌ ఔషధాలను వాడుతున్నట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు చెప్పారు. 


logo