శనివారం 04 జూలై 2020
National - Jul 01, 2020 , 09:21:49

వైద్యులకు దేశం వందనం చేస్తుంది : ప్రధాని మోదీ

వైద్యులకు దేశం వందనం చేస్తుంది : ప్రధాని మోదీ

ఢిల్లీ : నేడు డాక్టర్స్‌ డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. తన వైద్యులకు దేశం వందనం చేస్తుందన్నారు. కోవిడ్‌-19కు వ్యతిరేకంగా పోరాటంలో ముందంజలో ఉన్న వైద్యులులకు భారతదేశం నమస్కరిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ డేను పురస్కరించుకుని సీఏ కమ్యూనిటికి ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యకరమైన, పారదర్శక ఆర్థిక వ్యవస్థను నిర్ధారించడంలో కష్టపడి పనిచేసే సీఏ కమ్యూనిటికి ప్రధాన పాత్ర ఉందన్నారు. దేశానికి వారి సేవలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు.


logo