శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 14, 2020 , 12:29:33

మోదీ చేతుల్లో దేశం సుర‌క్షితం : జ‌్యోతిరాధిత్య సింథియా

మోదీ చేతుల్లో దేశం సుర‌క్షితం : జ‌్యోతిరాధిత్య సింథియా

హైద‌రాబాద్‌: ప్ర‌ధాని మోదీ చేతుల్లో భార‌త్ సుర‌క్షితంగా ఉంద‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ బీజేపీ నేత జ్యోతిరాధిత్య సింథియా అన్నారు.  రాజస్థాన్ రాజ‌కీయ సంక్షోభంపై స్పందించిన సింథియా ఈ విధంగా కామెంట్ చేశారు.  కాంగ్రెస్ పార్టీలో జ‌రుగుతున్న ప‌రిణామాలు దురదృష్ట‌క‌ర‌మ‌ని ఆయ‌న తెలిపారు.  గ‌తంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న జ్యోతిరాధిత్య సింథియా.. ఇటీవ‌ల బీజేపీ పార్టీలో చేరారు.  ప్ర‌స్తుతం ప్ర‌ధాని మోదీ హ‌స్తాల్లో దేశం సుర‌క్షితంగా ఉంద‌ని, మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ చేతుల్లో భ‌ద్రంగా ఉన్న‌ట్లు సింథియా తెలిపారు.   

మ‌రో వైపు ఇవాళ జ‌రిగిన కాంగ్రెస్ శాస‌న‌స‌భా ప‌క్ష భేటీకి మ‌ళ్లీ స‌చిన్ పైల‌ట్ డుమ్మాకొట్టారు.  సీఎల్పీ మీటింగ్‌కు హాజ‌రుకావాల‌ని అనేక మంది ఎమ్మెల్యేలు ఆయ‌న్ను కోరిన‌ట్లు తెలుస్తోంది. కానీ డిప్యూటీ సీఎం స‌చిన్ పైల‌ట్‌.. సీఎం గెహ్లాట్ తీరు ప‌ట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్ర‌స్తుత ద‌శ‌లో బ‌ల‌ప‌రీక్ష‌కు డిమాండ్ చేయ‌డం  లేద‌ని రాజ‌స్థాన్ బీజేపీ అధ్య‌క్షుడు తెలిపారు. తాము ఐక్యంగా ఉన్న‌ట్లు కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు, కానీ వారిలో అంత‌ర్గ‌త విబేధాలు ఉన్న‌ట్లు తెలుస్తోంద‌ని స‌తీష్ పునియా తెలిపారు. అవ‌మాన‌క‌ర రీతిలో స‌చిన్ పైల‌ట్ కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లిన‌ట్లు పునియా చెప్పారు. 
logo