బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 18:23:31

తమిళనాడులో ప్లాస్మా బ్యాంకు : ఆరోగ్యమంత్రి

తమిళనాడులో ప్లాస్మా బ్యాంకు : ఆరోగ్యమంత్రి

చెన్నై : దేశ రాజధానిలో రెండో జాతీయ స్థాయి ప్లాస్మా బ్యాంకును రూ.2.34 కోట్ల డాలర్ల వ్యవయంతో తమిళనాడులో ప్రారంభిస్తున్నట్లు తమిళనాడు ఆరోగ్యశాఖ మంతి విజయ్‌ భాస్కర్‌ గురువారం తెలిపారు. ‘ఇంతకు ముందు మేం ప్లాస్మా పద్ధతిని ట్రయల్‌ ప్రాతిపదికన నిర్వహిస్తున్నాం. మధురైలో నలుగురు వ్యక్తులపై విజయవంతంగా తొలిదశలో విజయవంతం చేపట్టారు.  సమీప జిల్లాల్లో మరికొన్ని బ్యాంకులు ఏర్పాటు చేస్తారు. మేం ఇప్పుడు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ ఆమోదం కలిగి ఉన్నాం. జాతీయస్థాయిలో రూ.2.34 కోట్ల మొత్తం బడ్జెట్‌లో రెండోవ ప్లాస్మా బ్యాంకును తెరిచాం’ అని విజయభాస్కర్‌ పేర్కొన్నారు. 

కొవిడ్‌-19 రోగిని డిశ్చార్జి చేసిన తర్వాత ప్లాస్మా దానం చేయడానికి 14 రోజుల సమయం వేచి ఉండాల్సి ఉంటుందని, రక్తం నుంచి వేరు చేసిన ప్లాస్మాను సంవత్సరం వరకు నిల్వ చేసి వాడుకోవచ్చని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో రెండు మిలియన్ల పరీక్షలు చేశామని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే టెస్టింగ్‌ పరంగా అత్యధిక సంఖ్యలో ఉన్నామని ఆరోగ్యమంత్రి పేర్కొన్నారు.  కాగా, రాష్ట్రవ్యాప్తంగా తమిళనాడులో 1,86,492 కరోనా కేసులు నమోదు కాగా, 51,765 యాక్టివ్‌ కేసులు ఉండగా, 1,31,583 రికవరీ కేసులు ఉన్నాయి. అలాగే వైరస్‌ ప్రభావంతో 3,144 మంది మరణించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo