బుధవారం 27 జనవరి 2021
National - Dec 21, 2020 , 21:33:36

60 శాతం పెరిగిన చిరుత పులుల సంఖ్య

60 శాతం పెరిగిన చిరుత పులుల సంఖ్య

న్యూఢిల్లీ: దేశంలో చిరుత పులుల సంఖ్య 60 శాతం పెరిగింది. ప్రస్తుతం 12,852 చిరుత పులులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ‘స్టేటస్ ఆఫ్ లిపార్డ్ ఇన్ ఇండియా 2018’ నివేదికను కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ సోమవారం విడుదల చేశారు. 2014లో నిర్వహించిన సర్వే కంటే ప్రస్తుతం చిరుత పులుల జనాభా 60 శాతానికి పైగా ఉన్నదని తెలిపారు. వీటి సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాలను ఆయన అభినందించారు. 3,421 చిరుత పులులతో మధ్యప్రదేశ్‌ తొలిస్థానంలో ఉండగా 1,783 సంఖ్యతో కర్ణాటక రెండో స్థానంలో 1,690 సంఖ్యతో మహారాష్ట్ర మూడో స్థానంలో ఉన్నట్లు చెప్పారు. గత కొన్ని ఏండ్లుగా  పులి, సింహం, చిరుతపులి జనాభా పెరుగుదల వన్యప్రాణులు, వాటి జీవవైవిధ్యానికి సాక్ష్యంగా నిలుస్తున్నదని ప్రకాష్ జవదేకర్ తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo