శ్రీలంకకు ఐదు లక్షల డోసుల వ్యాక్సిన్ గిఫ్ట్..

న్యూఢిల్లీ : కరోనా కట్టడిలో పొరుగుదేశాలకు భారతదేశ సహకారం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు దేశాలకు వ్యాక్సిన్ను కానుకగా పంపిన కేంద్ర ప్రభుత్వం.. శ్రీలంకకు ఐదు లక్షల డోసుల వ్యాక్సిన్ను తరలించింది. పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ తయారు చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ను ముంబైలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయం నుంచి గురువారం ఎయిర్ ఇండియా విమానంలో వ్యాక్సిన్లను పంపారు. కరోనా పోరులో సాయం అందిస్తామని గతేడాది సెప్టెంబర్లో శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్సకు ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. వైద్య, ఆర్థిక వ్యవస్థపై పడే భారాన్ని తగ్గించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఇందులో భాగంగానే భారత్ టీకాలను ఉచితంగా సరఫరా చేస్తోంది. గతంలో శ్రీలంక ప్రభుత్వానికి భారత ప్రభుత్వం 26 టన్నుల మందులను, మెడికల్ పరికరాలను కూడా అందించింది. ఇప్పటి వరకు భూటాన్, మాల్దీవులు, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, మారిషస్, సీషెల్స్ దేశాలకు ఉచితంగా అందజేసింది. బ్రెజిల్, మొరాకో దేశాలకు వాణిజ్య పద్ధతిలో 20 లక్షల డోసుల ఎగుమతిని ప్రారంభించింది. సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలకు త్వరలో వాణిజ్య పద్ధతిలో సరఫరా చేయనుంది. ఇదిలా ఉండగా.. ఈ నెల 23న కొవిషీల్డ్ వ్యాక్సిన్ను అత్యవసర సమయంలో ఉపయోగించేందుకు శ్రీలంక డ్రగ్ రెగ్యులేటరి ఆమోదించింది. ఫ్రంట్లైన్ కార్మికులు, సాయుధ బలగాల సిబ్బందితో సహా పలువురితో కూడిన ప్రాధాన్య జాబితాను సిద్ధం చేసింది.
తాజావార్తలు
- ‘యూపీఐ’ సేవలకు ట్రూకాలర్ రాంరాం.. సేఫ్టీపైనే ఫోకస్
- చమురు షాక్: ఏడేండ్లలో 459% పెరుగుదల
- ఓలా ఫ్యూచర్ మొబిలిటీ.. 2 సెకన్లకో ఈ-స్కూటర్
- హైదరాబాద్లో కాల్పుల కలకలం
- రావణ వాహనంపై ఊరేగిన శ్రీశైలేషుడు..
- స్కూల్ గోడ కూలి.. ఆరుగురు కూలీలు మృతి
- హెబ్బా పటేల్ తలను ‘తెలిసిన వాళ్లు’ ఏదో చేసారబ్బా..!
- ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అంటే..!
- మహారాష్ట్రలో కొత్తగా 8,477 కరోనా కేసులు.. 22 మరణాలు
- పారితోషికం భారీగా పెంచిన నాని!