శనివారం 23 జనవరి 2021
National - Jan 13, 2021 , 15:46:15

తొలి స్వదేశీ మెషిన్‌ పిస్టల్‌ను ప్రదర్శించిన డీఆర్డీవో

తొలి స్వదేశీ మెషిన్‌ పిస్టల్‌ను ప్రదర్శించిన డీఆర్డీవో

న్యూఢిల్లీ: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తొలి మెషిన్‌ పిస్టల్‌ ‘అస్మి’ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) బుధవారం ప్రదర్శించింది. డీఆర్డీవో, భారత ఆర్మీ కలిసి సంయుక్తంగా ఈ చేతి తుపాకీని అభివృద్ధి చేశాయి. ఇజ్రాయోల్‌కు చెందిన ఉజి సిరీస్‌ మెషిన్‌ పిస్టల్‌ను ఇది పోలి ఉంటుంది. వంద మీటర్ల పరిధిలోని లక్ష్యాలను గురి చూసి కాల్చవచ్చు. గత నాలుగు నెలల్లో 300 రౌండ్లకు పైగా కాల్పులు జరిపి నమూనా పిస్టల్‌ను పరిశీలించారు. బుధవారం జరిగిన ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా తొలి దేశీయ మెషిన్‌ పిస్టల్‌ ‘అస్మి’ని ప్రదర్శించారు. రక్షణ దళాల్లో 9 ఎంఎం పిస్టల్స్ స్థానాన్ని ఇది భర్తీ చేయనున్నది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo