శనివారం 28 మార్చి 2020
National - Feb 24, 2020 , 01:02:37

భారత జీవ వైవిధ్యాన్ని రక్షించండి

భారత జీవ వైవిధ్యాన్ని రక్షించండి
  • మన్‌కీ బాత్‌లో మోదీ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: యావత్‌ మానవ సమాజానికి ‘ఉమ్మడి సంపద’ అయిన భారత జీవ వైవిధ్యం   పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రధానిమోదీ కోరారు. ఆయన ఆదివారం ‘మన్‌కీ బాత్‌'లో మాట్లాడుతూ  తమిళ రచయిత్రి అవ్వాయార్‌ను ఉటంకిస్తూ ‘మనకు తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత. భారత జీవ వైవిధ్యం విషయంలోనూ ఇది వర్తిస్తుంది’ అని పేర్కొన్నారు.  ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి 500కి పైగా పక్షి జాతులు భారత్‌కు వస్తాయని పలు వలస పక్షిజాతులకు భారత్‌ సొంతిల్లు అని అభివర్ణించారు. ఇటీవల రాజ్‌పథ్‌ వద్ద కేంద్ర హోం శాఖ నిర్వహించిన ‘హునర్‌ హాట్‌'.. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, వంటకాలు భారత జీవ వైవిధ్యానికి ఉత్తమ ఉదాహరణ అని మోదీ అన్నా రు. ‘హునర్‌ హాట్‌' నిర్వహణతో మూడు లక్షల మంది కళాకారులకు ఉపాధి లభించిందని చెప్పారు. 


logo