మంగళవారం 26 జనవరి 2021
National - Dec 22, 2020 , 13:12:51

‌దేశంలో 3 ల‌క్ష‌ల దిగువకు యాక్టివ్ కేసులు

‌దేశంలో 3 ల‌క్ష‌ల దిగువకు యాక్టివ్ కేసులు

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం క్ర‌మంగా త‌గ్గిపోతున్న‌ది. రోజురోజుకు కొత్త‌గా న‌మోద‌య్యే పాజిటివ్ కేసుల సంఖ్య త‌గ్గిపోతూ.. వైర‌స్ బారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూ వ‌స్తున్న‌ది. మంగ‌ళ‌వారం ఉద‌యానికి గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 19,556 కొత్త కేసులు న‌మోదుకాగా 30,376 మంది రిక‌వ‌రీ అయ్యారు. దీంతో దేశంలో ప్ర‌స్తుతం మిగిలి ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య మూడు ల‌క్ష‌ల దిగువ‌కు వ‌చ్చింది. మంగ‌ళ‌వారం ఉద‌యానికి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య‌ 2,92,518గా ఉన్న‌ది. 

అయితే, మంగ‌ళ‌వారం కొత్త‌గా న‌మోదైన కేసుల‌తో క‌లిపి దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,00,75,116కు పెరిగింది. అందులో రిక‌వ‌రీలు 96,36,487, క‌రోనా మ‌ర‌ణాలు 1,46,111 పోగా యాక్టివ్ కేసుల సంఖ్య మూడు ల‌క్ష‌ల కింద‌కు దిగి వ‌చ్చింది. దాంతో దేశంలోని మొత్తం పాజిటివ్ కేసుల‌లో యాక్టివ్ కేసుల శాతం 3 నుంచి 2.90కి ప‌డిపోయింది.        

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo