గురువారం 21 జనవరి 2021
National - Dec 19, 2020 , 19:10:40

వ్యాక్సిన్ పంపిణీకి 80 వేల కోట్లు అవసరం: సీరం సంస్థ

వ్యాక్సిన్ పంపిణీకి 80 వేల కోట్లు అవసరం: సీరం సంస్థ

న్యూఢిల్లీ : కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం వచ్చే ఏడాది రూ.80,000 కోట్ల భారీ నిధులు అవసరం కానున్నాయి. ఈ విషయాన్ని ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తయారీకి ఆస్ట్రాజెనెకాతో భాగస్వామ్యమైన పుణేకు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సీఐఐ) శనివారం వెల్లడించింది.  

మొదటి దశలో దాదాపు 30 కోట్ల మందికి టీకాలు వేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఇది కోటి ఆరోగ్య సంరక్షణ కార్మికులతో పాటు  రెండు కోట్ల ఫ్రంట్‌లైన్ వారియర్స్‌, మున్సిపల్ కార్మికులు, 27 కోట్ల మంది వృద్ధులు, 50 ఏండ్ల వయసు పైబడి కొమొర్బిడిటీలతో బాధపడుతున్నవారికి మొదటి దశలో టీకాలు అందించనున్నారు. సీరం ఇన్‌స్టిట్యూట్-ఆక్స్‌ఫర్డ్ యొక్క కోవిషీల్డ్, భారత్ బయోటెక్ యొక్క కోవాక్సిన్, ఫైజర్ వ్యాక్సిన్లు అత్యవసర వినియోగ కోసం పోటీలో ఉన్నాయి. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) సీరం ఇన్‌స్టిట్యూట్‌తో పాటు భారత్ బయోటెక్ నుంచి అదనపు డాటాను కోరింది. ఇంత పెద్ద ఎత్తున పంపిణీకి నిధులు భారీగా అవసరం అవుతాయని, అందుకు భారతదేశం నిధులతో సిద్ధంగా ఉండాలని సీరం ఇన్‌స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సతీష్ డీ రవేత్కర్ అన్నారు.  కొవిడ్ -19 వ్యాక్సిన్ పంపిణీ కోసం వచ్చే ఏడాదికి సుమారు రూ.80 వేల కోట్లు అవసరమవుతాయని అయన తెలిపారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో వ్యాక్సిన్‌ను సురక్షితంగా ఉంచేందుకు అవసరమైన ఉష్ణోగ్రతల నిర్వహణకు సహాయపడే తగినంత విద్యుత్ సరఫరాను భారతదేశం మరింతగా నిర్ధారించాల్సి ఉంటుందన్నారు. సీరం ఇన్‌స్టిట్యూట్‌లో ఏటా 1.6 మిలియన్ మోతాదులను ఉత్పత్తి చేస్తున్నట్లు రవేత్కర్‌ పేర్కొన్నారు. ఐటీ-ఎనేబుల్డ్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్ ఏర్పాటుచేయాల్సి ఉంటుందన్నారు. నకిలీలతో అనుభవమున్నందున దానిని నియంత్రించడానికి వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo