ఆదివారం 24 జనవరి 2021
National - Dec 19, 2020 , 16:31:26

టీకా పంపిణీ.. ఏడాదికి 80 వేల కోట్లు

టీకా పంపిణీ.. ఏడాదికి 80 వేల కోట్లు

హైద‌రాబాద్: వ‌చ్చే ఏడాది దేశ‌వ్యాప్తంగా కోవిడ్ టీకాను పంపిణీ చేయాలంటే భార‌త ప్ర‌భుత్వానికి సుమారు 80 వేల కోట్ల ఖ‌ర్చు అవుతుంద‌ని సీరం ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియా పేర్క్కొన్న‌ది.  ఆక్స్‌ఫ‌ర్డ్‌-ఆస్ట్రాజెన్‌కాతో క‌లిసి సీరం సంస్థ కోవీషీల్డ్ టీకాను త‌యారు చేస్తున్న విష‌యం తెలిసిందే.  తొలి ద‌శ‌లో సుమారు 30 కోట్ల మందికి భార‌త ప్ర‌భుత్వం టీకా ఇవ్వాల‌ని భావిస్తున్న‌‌ది. మొద‌ట కోటి మంది హెల్త్‌కేర్ వ‌ర్క‌ర్ల‌కు టీకా ఇవ్వ‌నున్నారు. ఆ త‌ర్వాత రెండు కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్లు, 27 కోట్ల మంది వృద్ధులు ఆ జాబితాలో ఉన్నారు.  సీరం సంస్థ ఎగ్జిక్యూటివ్ డైర‌క్ట‌ర్ డాక్ట‌ర్ స‌తీష్ డీ రావేత్న‌క‌ర్ వ్యాక్సిన్ పంపిణీపై మాట్లాడారు. విస్తృత స్థాయిలో టీకా పంపిణీ చేయాలంటే భారీగా నిధులు అవ‌స‌రం ఉంటుంద‌ని, వచ్చే ఏడాది కోవిడ్ టీకా అందించాలంటే క‌నీసం 80 వేల కోట్ల ఫండింగ్ ప్ర‌భుత్వానికి అవ‌స‌రం ఉంటుంద‌ని డాక్ట‌ర్ స‌తీష్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో టీకాలు సుర‌క్షితంగా ఉండాలంటే.. నిరంత‌రం విద్యుత్తు స‌ర‌ఫ‌రాను  మెయిన్‌టేన్ చేయాల్సి ఉంటుంద‌న్నారు.  వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్‌పై నాస్కామ్ నిర్వ‌హించిన వెబినార్‌లో ఆయ‌న ఈ అభిప్రాయాలు వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం చొర‌వ చూపిస్తే, టీకా కంపెనీలు త‌మ ఉత్ప‌త్తుల‌ను స‌మ‌యానికి అందేలా చేస్తాయ‌న్నారు. 


logo