శుక్రవారం 10 జూలై 2020
National - Jun 20, 2020 , 09:34:16

భారత్‌లో ఒక్కరోజే 14,516 కరోనా కేసులు

భారత్‌లో ఒక్కరోజే 14,516 కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి ఉధ్ధృతి కొనసాగుతోంది. కేసుల సంఖ్యలో ప్రతిరోజూ కొత్త రికార్డు నమోదవుతోంది.  గురువారం 12,881..శుక్రవారం 13,586 కొత్త కేసులు  నమోదైన విషయం తెలిసిందే. శనివారం ఒక్కరోజే కొత్తగా 14,516 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వరుసగా 9వ రోజూ 10వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4 లక్షలకు చేరువలో ఉన్నది. 

దేశవ్యాప్తంగా శనివారం ఉదయం వరకు మొత్తం 3,95,048 మందికి వైరస్‌ సోకినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో మరో 375 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 12,948కు పెరిగింది. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 1,68,269 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకొని 2,13,831 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 


logo