లక్నో : ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోన్న విషయం విదితమే. బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెనేగర్ భార్య సంగీతకు యూపీ పంచాయతీ ఎన్నికల్లో టికెట్ వరించింది. టికెట్ ఇచ్చింది కూడా బీజేపీనే. అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్యే కుల్దీప్ సెనేగర్ను పార్టీ నుంచి బీజేపీ బహిష్కరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతంగా సంగీత ఉన్నావ్ జిల్లా పంచాయతీ చైర్ పర్సన్‌గా కొనసాగుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఫతేపూర్ చౌరాసితృతయా సీటు నుంచి బరిలో దిగారు. అయితే భర్తను పార్టీ నుంచి బహిష్కరించి భార్యకు టికెట్ ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి.