e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Home News దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 39,742 పాజిటివ్‌లు

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 39,742 పాజిటివ్‌లు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. శనివారం 39 వేల కేసులు నమోదవగా, తాజాగా మరో ఏడు వందల కేసులు అదనంగా రికార్డయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 39,742 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,13,71,901కు చేరింది. ఇందులో 4,08,212 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 4,20,551 మంది బాధితులు మహమ్మారి వల్ల మరణించారు. మొత్తం కేసుల్లో 3,05,43,138 మంది బాధితులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, శనివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 39,972 మంది కోలుకోగా, కొత్తగా 535 మంది మృతిచెందారని తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు 43,31,50,864 మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేశామని తెలిపింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana