e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home News Covid-19 | దేశంలో కొత్తగా 27 వేల కరోనా కేసులు

Covid-19 | దేశంలో కొత్తగా 27 వేల కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 27,176 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,33,16,755కు చేరింది. ఇందులో 3,51,087 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,25,22,171 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,43,497 మంది బాధితులు మృతిచెందారు. కాగా, మంగళవారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 38,012 మంది కోలుకోగా, 284 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో 61,15,690 మందికి కరోనా వ్యాక్సినేషన్‌ చేశామని వెల్లడించింది. దీంతో మొత్తం 75,89,12,277 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.

దేశవ్యాప్తంగా మంగళవారం వరకు 54,60,55,796 నమూనాలకు పరీక్షలు చేశామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) వెల్లడించింది. ఇందులో నిన్న ఒక్కరోజే 16,10,829 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని తెలిపింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana