శనివారం 16 జనవరి 2021
National - Jan 02, 2021 , 09:48:18

గ‌త 24 గంట‌ల్లో 19,078 క‌రోనా పాజిటివ్ కేసులు

గ‌త 24 గంట‌ల్లో 19,078 క‌రోనా పాజిటివ్ కేసులు

హైద‌రాబాద్‌:  దేశంలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 19,078 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.  ఈ విష‌యాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ వెల్ల‌డించింది.  దేశ‌వ్యాప్తంగా 22,926 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు.  24 గంట‌ల్లోనే 224 మంది మ‌ర‌ణించారు.  దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టికే క‌రోనా కేసులు ఒక కోటి మూడు ల‌క్ష‌లు దాటింది.  మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2,50,183గా ఉంది.  ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 99,06,387గా ఉంది. దేశ‌వ్యాప్తంగా వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించిన వారి మొత్తం సంఖ్య 1,49,218కి చేరుకున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ చెప్పింది.