గురువారం 09 జూలై 2020
National - Jun 23, 2020 , 10:17:15

దేశంలో ఒక్కరోజే కొత్తగా 14,933 మందికి కరోనా

దేశంలో ఒక్కరోజే కొత్తగా 14,933 మందికి కరోనా

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులతో పాటు మరణాలు కూడా ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి.  గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 14,933 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా 312 మంది మృతిచెందినట్లు  కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది. వరుసగా 12వ రోజూ  దేశంలో  10వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 

దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య  4,40,215కు చేరింది. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 1,78,014 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకొని 2,48,190 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. మంగళవారం ఉదయం వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 14,011కు పెరిగింది. 


logo