శనివారం 27 ఫిబ్రవరి 2021
National - Jan 24, 2021 , 10:06:05

దేశంలో కొత్తగా 14 వేల కరోనా కేసులు

దేశంలో కొత్తగా 14 వేల కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 14,849 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,54,533కు చేరింది. ఇందులో 1,03,16,786 మంది ప్రాణాంతక వైరస్‌ బారినుంచి బయటపడగా, 1,84,408 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 1,53,339 మంది బాధితులు వైరస్‌ వల్ల మరణించారు. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 15,948 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. మహమ్మారి బారినపడినవారిలో మరో 155 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

దేశంలో మొదటి విడుత కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా వైరస్‌పై ముందుండి పోరాడుతున్న ఆరోగ్య కర్యకర్తలకు కరోనా టీకా పంపిణీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటిరకు 15,82,201 మందికి వ్యాకినేషన్‌ చేశామని మంత్రిత్వశాఖ వెల్లడించింది. 

VIDEOS

logo