హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో కార్యదర్శిగా చెంగల్వ కళ్యాణ్ రావు ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ లీగల్ సెల్‌కు చెందిన కళ్యాణ్ రావు తెలంగాణ భవన్ కేంద్రంగా పని చేసే ఎన్నికల న్యాయ సలహాల విభాగంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. విజేతగా నిలిచిన కళ్యాణ్ రావుకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి .వినోద్ కుమార్, టీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి సోమ భరత్ కుమార్ సహా పలువురు టీఆర్ఎస్ నేతలు అభినందనలు తెలిపారు.