శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 27, 2020 , 09:46:16

దేశంలో 60 లక్ష‌ల‌కు చేరువ‌లో క‌రోనా కేసులు

దేశంలో 60 లక్ష‌ల‌కు చేరువ‌లో క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ ఉధృత‌మ‌వుతున్నాయి. నాలుగు రోజుల‌పాటు త‌గ్గిన కేసులు, శుక్ర‌వారం నుంచి పెరుగుతూ వ‌స్తున్నాయి. నిన్న 86 వేల మంది క‌రోనా బారిన‌ప‌డ‌గా, ఈరోజు మ‌రో 88 వేల మందికి క‌రోనా సోకింది. దీంతో క‌రోనా కేసులు 60 ల‌క్ష‌ల‌కు చేరువ‌య్యాయి. 

దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో 88,600 మందికి క‌రోనా వైర‌స్ సోకింది. దీంతో మొత్తం క‌రోనా కేసులు 5,992,533కు చేరాయి. ఇందులో 9,56,402 మంది క‌రోనాకు చికిత్స పొందుతుండ‌గా, మ‌రో 49,41,628 మంది కోలుకుని ఇంటికి చేరారు. కాగా, నిన్న ఉద‌యం నుంచి ఇప్ప‌టివ‌రకు క‌రోనాతో 1124 మంది మ‌ర‌ణించారు. దీంతో ఇప్ప‌టివ‌రకు మొత్తం 94,503 మంది బాధితులు చ‌నిపోయారు. 

సెప్టెంబ‌ర్ 26 వ‌ర‌కు దేశంలో 7,12,57,836 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని భార‌తీయ‌ వైద్య ప‌రిశోధాన మండ‌లి (ఐసీఎమ్మార్‌) ప్ర‌క‌టించింది. నిన్న ఒకేరోజు 9,87,861 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని తెలిపింది.