శనివారం 05 డిసెంబర్ 2020
National - Oct 26, 2020 , 10:07:42

దేశంలో 79 ల‌క్ష‌లు దాటి‌న‌ క‌రోనా కేసులు

దేశంలో 79 ల‌క్ష‌లు దాటి‌న‌ క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు భారీగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. నిన్న 50 వేల పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, తాజాగా దానికి ఐదు వేలకుపైగా త‌క్కువ క‌రోనా కేసులు రికార్డ‌య్యాయి. దీంతో దేశంలో 79 ల‌క్ష‌ల మార్కును దాటాయి. 

దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో 45,149 మంది కొత్త‌గా క‌రోనా బారిన‌ప‌డ్డారు. దీంతో దేశంలో క‌రోనా బాధితుల సంఖ్య 79,09,960కి చేరింది. ఇందులో 6,53,717 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నిన్న మ‌రో 59,105 మంది క‌రోనా నుంచి కోలుకోవ‌డంతో మొత్తంగా 71,37,229 మంది బాధితులు క‌రోనా నుంచి బ‌య‌టప‌డ్డారు. నిన్న ఉద‌యం నుంచి ఈరోజువ‌ర‌కు క‌రోనా‌తో 480 మంది మ‌ర‌ణించారు. దీంతో క‌రోనా మృతుల సంఖ్య 1,19,014కు చేరింద‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ‌ ప్ర‌క‌టించింది. 

దేశంలో నిన్న‌టివ‌ర‌కు 10,34,62,778 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి (ఐసీఎమ్మార్‌) ప్ర‌క‌టించింది. అక్టోబ‌ర్ 25న 9,39,309 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని తెలిపింది.