గురువారం 13 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 10:01:29

దేశంలో 36 వేలు దాటిన క‌రోనా మ‌ర‌ణాలు

దేశంలో 36 వేలు దాటిన క‌రోనా మ‌ర‌ణాలు

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న‌ది. క‌రోనా బారిన ప‌డుతున్న‌వారి సంఖ్య పెరిగిపోతుండ‌టంతో ప్ర‌తి రోజు రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. నిన్న 55 వేల పైచిలుకు కేసులు న‌మోద‌వ‌గా, తాజాగా అంత‌కుమించి 57 వేల‌కుపైగా జ‌నాభా క‌రోనా బారినప‌డ్డారు. దీంతో దేశంలో క‌రోనా కేసులు 17 ల‌క్ష‌ల మార్కుకు నాలుగు వేల దూరంలో నిలిచాయి. 

దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో 57,117 పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, 764 మంది మ‌ర‌ణించారు. దీంతో దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 16,95,988కి చేర‌గా, క‌రోనా మ‌ర‌ణాలు 36,511కు పెరిగాయి. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన పాజిటివ్ కేసుల్లో 5,65,103 మంది ద‌వాఖాన‌ల్లో చికిత్స పొందుతుండ‌గా, మ‌రో 10,94,374 మంది కోలుకుని ఇంటికి చేరుకున్నారు. దీంతో క‌రోనా రిక‌వ‌రీ రేటు 65 శాతానికి చేరుకున్న‌ది. 

క‌రోనా మ‌ర‌ణాల్లో భార‌త్ ఇప్ప‌టికే ఇరాన్‌ను దాటేసి, అత్య‌ధిక మ‌ర‌ణాలు న‌మోద‌వుతున్న దేశాల్లో ఐదో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో అమెరికా మొద‌టి స్థానంలో ఉండ‌గా, బ్రెజిల్‌, బ్రిట‌న్‌, మెక్సికో దేశాలు త‌ర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 

ఒకేరోజు 5.25 ల‌క్ష‌ల క‌రోనా ప‌రీక్ష‌లు: ఐసీఎమ్మార్‌

దేశ‌వ్యాప్తంగా శుక్ర‌వారం రోజున 5,25,689 మంది క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి ప్ర‌క‌టించింది. అదేవిధంగా జూలై 31 వ‌ర‌కు 1,93,58,659 న‌మూనాలను ప‌రీక్షించామ‌ని వెల్ల‌డించింది. 


logo