గురువారం 09 జూలై 2020
National - Jun 22, 2020 , 09:57:32

దేశంలో కొత్తగా 14,821 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 14,821 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతున్నది. ప్రాణాతంక మహమ్మారి వాయు వేగంతో విస్తరిస్తున్నది. దీంతో దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 14,821 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ వల్ల మరో 445 మంది మృతిచెందారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 4,25,282కి చేరగా, మృతులు 13,699కి పెరిగారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,37,196 మంది కోలుకోగా, 1,74,387 మంది చికిత్స పొందుతున్నారు. 

దేశంలో అత్యధిక కరోనా కేసులతో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతున్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,32,075 కరోనా కేసులు నమోదవగా, 6170 మంది మరణించారు. ఢిల్లీలో 59,746 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 2175 మంది మృతిచెందారు. తమిళనాడులో ఇప్పటివరకు 59,377 కేసులు నమోదవగా, 757 మంది చనిపోయారు. గుజరాత్‌లో 27,260 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 1663 మంది మృతిచెందారు. ఉత్తరప్రదేశ్‌లో 17,731 మంది కరోనా బారినపడగా, 550 మంది బాధితులు మరణించారు. 


logo