బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 24, 2020 , 09:48:52

దేశంలో కొత్త‌గా 86 వేల క‌రోనా కేసులు

దేశంలో కొత్త‌గా 86 వేల క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. నాలుగు రోజుల‌పాటు 85 వేలలోపే పాజిటివ్‌ కేసులు న‌మోద‌వ‌గా, నేడు 86 వేల కేసులు రికార్డ‌య్యాయి. దీంతో మొత్తం కేసులు 57 ల‌క్ష‌ల మార్కును దాటాయి. 

దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో 86,508 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు పాజిటివ్ కేసుల సంఖ్య 57,32,519కు చేరింది. ఇందులో 46,74,988 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకోగా, 9,66,382 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. నిన్న ఉద‌యం నుంచి ఈరోజు ఉద‌యం వ‌ర‌కు 1129 మంది క‌రోనా వ‌ల్ల చ‌నిపోయారు. దీంతో దేశంలో క‌రోనా మృతుల సంఖ్య 91,149కి పెరిగింద‌ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్ర‌క‌టించింది.   

దేశంలో నిన్న 11,56,569 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి (ఐసీఎమ్మార్‌) ప్ర‌క‌టించింది. సెప్టెంబ‌ర్ 23 వ‌ర‌కు మొత్తం 6,74,36,031 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని వెల్ల‌డించింది. 


logo