గురువారం 29 అక్టోబర్ 2020
National - Sep 30, 2020 , 09:50:09

దేశంలో 62 ల‌క్ష‌లు దాటిన క‌రోనా బాధితులు

దేశంలో 62 ల‌క్ష‌లు దాటిన క‌రోనా బాధితులు

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ఏమాత్రం త‌గ్గ‌డంలేదు. రోజువారీ కేసుల్లో హెచ్చుత‌గ్గులు ఉన్న‌ప్పటికీ, దేశంలో ఇంకా భారీసంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. నేడు మ‌రో 80 వేల మంది కొత్త‌గా క‌రోనా బారిన‌ప‌డ్డారు. దీంతో దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు 62 ల‌క్షల మార్కును దాటాయి. 

దేశ‌వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 80,472 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన క‌రోనా కేసుల సంఖ్య 62,25,764కు చేరింది. ఇందులో 9,40,441 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మ‌రో 51,87,826 మంది  బాధితులు క‌రోనా నుంచి కోలుకుని ఇంటికి చేరారు. నిన్న ఉద‌యం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా వ‌ల్ల 1179 మంది మ‌ర‌ణించారు. దీంతో క‌రోనా మృతుల సంఖ్య 97,497కు చేరింద‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ ప్ర‌క‌టించింది. దేశంలో క‌రోనా రిక‌వ‌రీ రేటు 83.33 శాతానికి చేరింద‌ని, మ‌ర‌ణాల రేటు 1.57 శాతంగా ఉంద‌ని వెల్ల‌డించింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 15.42 శాతంగా ఉన్నాయ‌ని తెలిపింది. 

దేశ‌వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 29 వ‌ర‌కు 7,41,96,729 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేశామ‌ని భార‌తీ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి (ఐసీఎమ్మార్‌) ప్ర‌క‌టించింది. ఇందులో నిన్న ఒక్క‌రోజే 10,86,688 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని వెల్ల‌డించింది. 


logo