శనివారం 26 సెప్టెంబర్ 2020
National - Aug 09, 2020 , 10:05:52

దేశంలో కొత్త‌గా 64,399 పాజిటివ్ కేసులు

దేశంలో కొత్త‌గా 64,399 పాజిటివ్ కేసులు

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా మ‌హోగ్ర‌రూపం దాల్చింది. వైర‌స్ వ్యాప్తి విస్తృత‌మ‌వ‌డంతో పాజిటివ్‌ కేసులు అంత‌కంత‌కు పెరుగుతున్నాయి. వ‌రుస‌గా ఎనిమిది రోజుల‌పాటు ప్ర‌తిరోజు 54 వేల చొప్పున కేసులు న‌మోద‌వ‌గా, గ‌త మూడు రోజులుగా 62 వేల‌కు పైగా వ‌స్తున్నాయి. తాజాగా రికార్డుస్థాయిలో 64 వేల‌కుపైగా మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. దీంతో దేశంలో క‌రోనా కేసులు 21 ల‌క్ష‌లు దాటాయి.   

దేశ‌వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 64,399 మంది క‌రోనా పాజిటివ్‌లుగా తేలారు. దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 21,53,011కు చెరింది. ఇందులో 6,28,747 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మ‌రో 14,80,885 మంది బాధితులు కోలుకున్నారు. నిన్న ఒక్క‌రోజే కొత్త‌గా 861 మంది మ‌ర‌ణించారు. దీంతో క‌రోనాతో మ‌ర‌ణించిన‌వారి సంఖ్య 43,379కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దేశంలో కోలుకున్న‌వారి సంఖ్య పెరుగుతుండ‌టంతో రిక‌వ‌రీ రేటు 68.3 శాతంగా ఉన్న‌ద‌ని ప్ర‌క‌టించింది. 


logo