శనివారం 30 మే 2020
National - May 24, 2020 , 09:39:40

దేశంలో కరోనా విజృంభన

దేశంలో కరోనా విజృంభన

న్యూఢిల్లీ: దేశంలో గత కొన్ని రోజులుగా ఐదు వేలకు తగ్గకుండా కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గకుండా నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 6767 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ ప్రభావంతో కొత్తగా 147 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,31,868కి పెరిగింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో ఇంకా 73,560 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 54,440 మంది కోలుకున్నారు. ప్రాణాంతక వైరస్‌వల్ల 3867 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 

దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ర్టాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతున్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు 47,190 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 1577 మంది బాధితులు మరణించారు. రెండో స్థానంలో ఉన్న తమిళనాడులో 15512 కరోనా కేసులు నమోదవగా, 103 మంది మృతిచెందారు. గుజరాత్‌లో 13664 కేసులు నమోదవగా, 829 మంది కన్నుమూశారు. నాలుగో స్థానంలో ఉన్న ఢిల్లీలో కరోనా కేసులు సంఖ్య 12910కి చేరింది. రాష్ట్రంలో ఈ వైరస్‌ బారినపడిన వారిలో 231 మంది మరణించారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ర్టాల్లో ఇప్పటివరకు ఆరువేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


logo