శుక్రవారం 03 జూలై 2020
National - Jul 01, 2020 , 09:47:28

దేశంలో 24 గంటల్లో కరోనాతో 507 మంది మృతి

దేశంలో 24 గంటల్లో కరోనాతో 507 మంది మృతి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది. దేశంలో కరోనా కేసులతోపాటు, మరణాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. గత పది రోజులుగా 15వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్‌ ప్రభావంతో గత 24 గంటల్లో 507 మంది మరణించగా, కొత్తగా 18,653 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,85,493కి చేరగా, మరణించినవారి సంఖ్య 17,400కు పెరిగింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 2,20,114 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,47,979 మంది బాధితులు కోలుకున్నారు.  

జూన్‌ 30 వరకు 86,26,585 పరీక్షలు చేశామని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ప్రకటించింది. నిన్న ఒక్కరోజే 2,17,931 నమూనాలు పరీక్షించామని తెలిపింది. దేశంలో నిన్న 18522 మంది కరోనా బారినపడ్డారు.


logo