గురువారం 26 నవంబర్ 2020
National - Oct 25, 2020 , 10:09:57

24 గంటల్లో దేశంలో 50,129 కొవిడ్‌ కేసులు

24 గంటల్లో దేశంలో 50,129 కొవిడ్‌ కేసులు

న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24గంటల్లో 50,129 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 78,64,811కి చేరాయి. మరో 578 మంది మహమ్మారి కారణంగా మృత్యువాతపడగా.. మృతుల సంఖ్య 1,18,534కు చేరింది. గత 24 గంటల్లో దేశంలో 62,077 మంది రోగులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. మహమ్మారి ప్రారంభం నుంచి 70,78,123 మంది కోలుకోగా.. రికవరీ రేటు 89.9 శాతానికి చేరింది. ప్రస్తుతం దేశంలో 6,68,154 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇదిలా ఉండగా.. దేశంలో శనివారం ఒకే రోజు 11,40,905 టెస్టులు నిర్వహించిన ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. ఇప్పటి వరకు 10,25,23,469 నమూనాలను పరిశీలించిన వివరించింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.