సోమవారం 18 జనవరి 2021
National - Jan 03, 2021 , 10:08:28

దేశంలో కొత్తగా 18,177 కొవిడ్‌ కేసులు

దేశంలో కొత్తగా 18,177 కొవిడ్‌ కేసులు

న్యూఢిల్లీ : గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 18,177 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,03,23,965కు పెరిగింది. వైరస్‌ ప్రభావంతో మరో 217 మంది మృత్యువాతపడగా.. మృతుల సంఖ్య 1,49,435కు చేరింది. తాజాగా 20,923 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 99,27,310 డిశ్చార్జి అయ్యారని మంత్రిత్వశాఖ వివరించింది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసులు 2,47,220 ఉన్నాయని పేర్కొంది. ఇదిలా ఉండగా.. దేశంలో శనివారం ఒకే రోజు 9,58,125 శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. ఇప్పటి వరకు 17,78,99,783 నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.