శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 02, 2020 , 09:48:31

దేశంలో కొత్త‌గా 45 వేల‌కుపైగా క‌రోనా కేసులు

దేశంలో కొత్త‌గా 45 వేల‌కుపైగా క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 45,230 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం క‌రోనా బాధితుల సంఖ్య 82,29,313కు చేరింది. ఇందులో 5,61,908 యాక్టివ్ ఉండ‌గా, 75,44,798 మంది కోలుకున్నారు. నిన్న మ‌రో 53,285 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. అదేవిధ‌గంగా నిన్న ఉద‌యం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 496 మంది బాధితులు మ‌ర‌ణించారు. దీంతో మృతులు 1,22,607కు చేరారు. దేశంలో రిక‌వ‌రీ రేటు 91.68 శాతానికి చేర‌గా, మ‌ర‌ణాల రేటు 1.49 శాతంగా ఉంద‌ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్ర‌క‌టించింది.  

దేశ‌వ్యాప్తంగా నిన్న‌టివ‌ర‌కు 11,07,43,103 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి (ఐసీఎమ్మార్‌) ప్ర‌క‌టించింది. నవంబ‌ర్ 1న 8,55,800 మందికి క‌రోనా ప‌రీక్షలు నిర్వ‌హించామ‌ని తెలిపింది. ‌