బుధవారం 08 జూలై 2020
National - Jun 21, 2020 , 15:05:34

చైనా సైన్యం క‌ద‌లిక‌ల‌పై భార‌త్ గ‌ట్టి నిఘా!

చైనా సైన్యం క‌ద‌లిక‌ల‌పై భార‌త్ గ‌ట్టి నిఘా!

న్యూఢిల్లీ: భారత్-చైనా స‌రిహ‌ద్దుల్లోని ల‌ఢ‌ఖ్ ప్రాంతంలో ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై చ‌ర్చించ‌డానికి కేంద్ర ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ఉద‌యం ఉన్న‌త‌స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్‌) బిపిన్ రావ‌త్‌తోపాటు త్రివిధ ద‌ళాల అధిప‌తులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చైనాతో భూస‌రిహ‌ద్దుతోపాటు గ‌గ‌న‌త‌లం, స‌ముద్ర‌త‌లంలోని వ్యూహాత్మ‌క ప్రాంతాల్లో ప‌టిష్ట నిఘా ఉంచాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిసింది. వాస్త‌వాధీన రేఖ వెంబ‌డి చైనా బ‌ల‌గాలు దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తే వారికి త‌గిన రీతిలో బుద్ధి చెప్ప‌డానికి ర‌క్ష‌ణ‌మంత్రి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. పీటీఐ వార్తా సంస్థ ఈ విష‌యాల‌ను వెల్ల‌డించింది. 

భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దుల్లో చైనా దురాక్ర‌మ‌ణ‌కు ప్ర‌య‌త్నించ‌డంతో జూన్ 15, 16 తేదీల్లో గ‌ల్వాన్ లోయ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకున్నాయి. ఈ ఘ‌ర్ష‌ణ‌ల్లో 20 మంది భార‌త జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశ‌వ్యాప్తంగా చైనాప‌ట్ల తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. చైనా దూకుడుకు స‌రైన రీతిలో దెబ్బ‌కొట్టాల‌ని దేశంలోని అన్ని వ‌ర్గాల నుంచి డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.   ‌


logo